Header Banner

ఇఫ్తార్ వివాదంలో దళపతి విజయ్.. ఉత్తరప్రదేశ్‌లో ఫత్వా జారీ! మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు!

  Thu Apr 17, 2025 21:00        Politics

టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో AIMJ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. విజయ్ నటించిన చిత్రాల్లో ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినందున..ఓట్ల కోసం ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రజ్వీ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇఫ్తార్ విందుకు జూదగాళ్లను ఆహ్వానించడంతో తమిళనాడులోని సున్నీ ముస్లింలు అతనిపై కోపంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారి కోరిక మేరకే ఫత్వా జారీ చేశానని ఆయన అన్నారు. నటుడు విజయ్ మార్చి 8న చెన్నైలోని వైఎంసిఎ మైదానంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఆయన తలకు టోపీ ధరించి, వారితో కలిసి ఉపవాసం విరమించారు. అయితే విజయ్ ఇఫ్తార్ విందును సరిగ్గా నిర్వహించలేదని, ఇఫ్తార్‌తో సంబంధం లేని వ్యక్తులు అక్కడికి పిలిచి ముస్లింలను అవమానించారని సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ అన్నారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలని విజయ్‌పై చెన్నై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #DalapathiVijay #IftharControversy #Fatwa #UttarPradesh #Accusations #Ramzan #ReligiousSentiments